జగిత్యాలరూరల్/జగిత్యాల: ప్రభుత్వం విద్య, వైద్యానికి నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి, మోరపల్లి శివారులో నిర్మించనున్న యంగ్ ఇంటిగ్రేట్‌డ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్కూల్ నిర్మాణ పనులకు ఈనెల 25న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రావు, నాయకులు బండ శంకర్, పెండెం రాములు, సర్పంచ్‌లు కట్ట రాజేందర్, గంగారెడ్డి, ఆనందరెడ్డి, తహసీల్దార్ హకీం పాల్గొన్నారు.
పేదలకు సీఎం సహాయనిధి అండ
జగిత్యాల: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తొందని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో 111 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.52.04 లక్షల విలువైన చెక్కులను అందించాడు. మున్సిపల్ చైర్పర్సన్ వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


