యాసంగిలో వరి సాగు వద్దు | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో వరి సాగు వద్దు

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

జగిత్యాల: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో వరి సాగును ప్రోత్సహించొద్దని, 8 నెలలకు నీరు సరిపోయేలా ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి కలెక్టరేట్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వానాకాలం గట్టెక్కే పరిస్థితి ఉందని, యాసంగిలో మాత్రం ఇబ్బందులు ఎదురుకానున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవాలన్నారు. మండలాల్లో అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిస్థితులను వివరించాలన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. కోతుల సమస్య ఉన్నచోట సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నా రు. వీబీజీరాంజీ పథకం ద్వారా అవసరమైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సాగవుతున్న కూరగాయలు జనాభాకు సరిపోవడం లేదని, సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని సూచించారు. మిషన్‌భగీరథ ద్వారా జూన్‌ వరకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులు యాసంగి ప్రణా ళిక రూపొందించాలన్నారు. ఎస్సారెస్పీ నుంచి నీరు వచ్చే అవకాశం లేదని, వరి సాగు వద్దని పేర్కొన్నారు. కార్యర్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాణి, మార్కెట్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలి

తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement