ప్రజావీరుడు పండుగ సాయన్న | - | Sakshi
Sakshi News home page

ప్రజావీరుడు పండుగ సాయన్న

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

నివాళులర్పిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌, చేతన్‌నితిన్‌

సాయన్న చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అధికారులు

జగిత్యాలటౌన్‌: నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు పండుగ సాయన్న అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ కొనియాడారు. సాయన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో గురువారం ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. నిజాం నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. నిజాం ధాన్యం కారాగారాన్ని కొల్లగొట్టిన పాపన్న పేదలకు పంచిపెట్టాడని అన్నారు. బీసీ సంక్షేమ అధికారి జయరాజ్‌, కలెక్టరేట్‌ ఏవో కిషన్‌, సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..

జగిత్యాలక్రైం: ఎస్పీ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతిని నిర్వహించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు అండగా నిలిచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రజా వీరుడు సాయన్న అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ చేతన్‌ నితిన్‌, ఆర్‌ఐలు వేణు, సైదులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement