తింటే బేజారే..! | - | Sakshi
Sakshi News home page

తింటే బేజారే..!

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

ఏ హోటల్‌ చూసినా అపరిశుభ్రతే కొరవడిన ఆహారభద్రత అధికారుల పర్యవేక్షణ ప్రజారోగ్యంతో నిర్వాహకుల చెలగాటం

అధికారుల తనిఖీలు లేక హోటల్‌ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

రోడ్డుపక్కన ఉండే చిన్నచిన్న హోటళ్లలోనూ అపరిశుభ్రత లోపిస్తోంది.

హోటళ్ల పక్కనే మురికికాలువలు ఉండటం.. ఆ సమీపంలోనే వంటపాత్రలు కడగడం, రోడ్లపై వచ్చే దుమ్ము తినే పదార్థాలపై పడి కలుషితం అవుతున్నాయి.

రెస్టారెంట్లలో గ్లాసులు దుర్వాసన వస్తున్నాయి.

ప్రతి హోటల్‌లో మాస్టర్లు, సర్వర్లు ఆఫ్రాన్లు, గ్లౌసులు ధరించాలి. కానీ.. జిల్లాలో ఇవి మచ్చు కై నా కన్పించవు.

ఆహారంలో వెంట్రుకలు రావడం, ఇతరత్రా పదార్థాలు కనిపిస్తున్నాయి.

చట్నీ దుర్వాసన రావడం మామూలుగా మా రింది.

ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీమళ్లీ వాడుతున్నారు. ఆ నూనెలోనే పిండి పదార్థాలు, చికెన్‌, మటన్‌ వంటి పదార్థాలను వేయిస్తున్నారు.

గతంలో తనిఖీ చేసే సమయంలో కుళ్లిన చికెన్‌, మటన్‌ ఇతరత్రా పదార్థాలు వెలుగు చూడగా.. నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలొచ్చాయి.

ఇటీవల కొత్తబస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో చట్నీలో గడ్డిపురుగు వచ్చింది.

తహసీల్‌ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్‌లో ఇడ్లీలో బొద్దింక కనిపించింది. చపాతిలో ఫంగస్‌ వచ్చింది.

శ్రీనివాస థియేటర్‌ సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో వడలో ఏకంగా జెర్రీ వచ్చింది.

ఇలా వరుస సంఘటనలు చోటుచేసుకుంటు న్నా.. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా.. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి హోటల్‌ను సీజ్‌ చేస్తున్నారు. కానీ.. సదరు హోటల్‌ మరుసటి రోజు నుంచే తెరుచుకుంటోంది.

చూస్తే

నోరూరే..

జగిత్యాల: జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఈగలు, కీటకాలు, బల్లులు, జెర్రీలు టిఫిన్లలో వెలుగుచూస్తున్నాయి. ఆహార భద్రత శాఖ అధికారులు, ఇటు మున్సిపల్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో హోటల్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. కిచెన్లలో పూర్తిగా అపరిశుభ్రత నెలకొంటోంది. వంటపాత్రలు సరిగా శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు తిరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు వారానికోసారైనా తనిఖీలు చేస్తే అనేక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. రెస్టారెంట్లలో చికెన్‌, మటన్‌, ఫ్రాన్స్‌ నిలువ ఉంచుతూ మత్తులో తినిపిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో బయటపడినప్పుడు ఆడపదడపా కేసులు పెడుతూ చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీలు శూన్యం

2025–2026లో అధికారుల పనితీరు ఇలా..

శాంపిల్స్‌ సేకరణ 415

తనిఖీలు 350

కేసులు 12

జరిమానా రూ.4.50 లక్షలు

నిబంధనలు గాలికే..

నిబంధనల ప్రకారం ఏ రోజు పదార్థాలను ఆరోజే విక్రయించాలి. ఒకసారి వినియోగించిన నూనెను మరోసారి వాడరాదు. అయినప్పటికీ రోజుల తరబడి అదే నూనెను వాడుతున్నారు. ముఖ్యంగా భోజనాలు, టిఫిన్లు తయారుచేసే ప్రాంతాల్లో వంటగదులు శుభ్రంగా ఉండాలి. కానీ హోటళ్లలో ఒక వైపు ఎలుకలు, మరోవైపు బల్లులు, జెర్రీలు, బొద్దింకలు, పందికొక్కులు సంచరిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement