హోటల్స్, రెస్టారెంట్లను తనిఖీలు చేస్తున్నారు. హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. లేకుంటే జరిమానాలు విధిస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. కిచెన్‌లోగానీ, తినేచోట గానీ పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టి సదరు హోటల్స్ సీజ్ చేస్తాం.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్
కేసులు నమోదు చేస్తున్నాం
హోటళ్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కల్తీ చేస్తే చర్యలు తీసుకుంటాం. నిత్యం తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదు చేసినా వెంటనే వచ్చి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నాం. రిపోర్ట్‌లను బట్టి కేసులు కూడా నమోదు చేస్తున్నాం.
– అనూష, ఫుడ్ ఇన్‌స్పెక్టర్


