జగిత్యాల: జిల్లాకేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో కొద్దిరోజులుగా బీటీరోడ్డు చేపడుతున్నారు. సోమవారం వర్షంలోనూ పనులు కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీరోడ్డు మొత్తం క్లీన్ చేసి పనులు చేపడితే తారురోడ్డు మన్నికగా ఉంటుంది. నిబంధనలు పాటించకుండా.. వర్షంలో పనులు చేస్తుండడంతో తారు లేచిపోతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, పనులు నాణ్యతగా చేయాలని మాజీ కౌన్సిలర్ అనుమండ్ల జయశ్రీ కోరారు. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు.


