జగిత్యాల: నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌బీ పనులకు నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేశామని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌కు రూ.35.50కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.8కోట్లు బాధితులకు చెల్లించినట్లు తెలిపారు. మిగతా రూ.27.50 కోట్లు లబ్ధిదారులకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందని, 10రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎల్లంపల్లి మెయిన్ కెనాల్‌కు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. 12 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముందుగా ధర్మపురి పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య ఏఎస్సైగా పదోన్నతి పొందగా.. ఎస్పీ హోదా స్టార్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి కేవలం హోదా పెరగడం మాత్రమే కాకుండా బాధ్యతలను పెంచుతుందన్నారు.
రైతులపై కేసులు ఎత్తివేయాలి
మెట్‌పల్లి: ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2021 సెప్టెంబర్‌లో ఆందోళన చేసిన తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బాధిత రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసులో సోమవారం స్థానిక కోర్టుకు వారు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా 18మంది రైతులపై కేసులు పెట్టిందని, తామంతా నాటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పన్నాల తిరుపతిరెడ్డి, బందెల మల్లన్న, మారు మురళీధర్‌రెడ్డి, కొట్టాల మోహన్, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.
23 నుంచి 25 వరకు మద్యం దుకాణాలు బంద్
జగిత్యాలక్రైం: గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని జిల్లాలోని 71 మద్యం దుకాణాలు, 20 బార్లు, 304 తెల్లకల్లు దుకాణాలను కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 23న ఉదయం నుంచి 25న ఉదయం వరకు మూసివేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతి తెలిపారు.


