నేను రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. నెల రోజుల నుంచి కోతులు రాకుండా కాపలా వెళ్తున్నాను. ఇప్పుడే పంట గింజ దశకు చేరుకుంది. మరో నెలరోజులు కాపలా ఉండాల్సిందే.
– వామన్, అంతర్గాం
కోతులతో పంట ధ్వంసం
కోతులతో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రోజంతా కాపలా ఉండాల్సి వస్తోంది. మా ఊర్లో కొందరు కోతుల కోసం కుక్కలను పెంచుతున్నారు. పంట చేతికొచ్చే వరకు కష్టంగానే ఉంది.
– కోల నారాయణ, చల్‌గల్


