విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలం

Sep 6 2026 2:31 AM | Updated on Sep 6 2026 2:31 AM

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల: విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. దేశ భవిష్యత్‌ విద్యార్థుల చేతుల్లో ఉందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని, 33 జిల్లాల్లో 33 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, మహిళలకు మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డకు రూ.13 వేలతో పాటు, కేసీఆర్‌ కిట్‌ ఇస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక అన్ని మూలన పడేశారన్నారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్‌ రావాలి అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి అభివృద్ధి పేరిట రేవంత్‌రెడ్డి సంకలో చేరాడన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ వందరోజుల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడమేంటన్నారు.బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రేవంత్‌రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement