కలలోనూ వెంటాడుతోంది | - | Sakshi
Sakshi News home page

కలలోనూ వెంటాడుతోంది

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

కలలోనూ వెంటాడుతోంది

నా పేరు గోల్కొండ విజయ(58). మాది డబ్బు తిమ్మాయపల్లి గ్రామం. నా కూతురు సుమలత గర్భవతి కావడంతో ఆ రోజు హాస్పిటల్లో చూయించుకునేందుకు పయనమయ్యాం. క్షణాల్లో బస్సు బోల్తాపడడంతో జనాలు నాపై పడడంతో చేతులు, పక్కటెముకలు విరిగిగాయి. వెన్నుపూసకు గాయమై కదలలేని పరిస్థితుల్లో ఉన్న. నాపై నుంచి శవాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతోంది. ప్రమాదంలో నా బిడ్డను కోల్పోయా. నేను హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నా. ఇంటికి వచ్చేవరకు నా బిడ్డ చనిపోయిన విషయం నాకు చెప్పలేదు. ఇప్పటికీ ఆ ప్రమాదం కలలోనూ వెంటాడుతోంది. శరీరంలో పలుచోట్ల రాడ్లు వేసి ఆపరేషన్‌ చేయడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నిలబడ్డానికి కూడా చేతనైత లేదు. పెద్ద సార్లు దయ తలచి నాకు పింఛన్‌ ఇప్పించాలని విన్నపం.

– విజయ, తిమ్మాయపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement