రాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వేదశ్రీ, సీహెచ్ అశ్రిత రాష్ట్రస్థాయి యోగా పో టీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణ ప్రసాద్ తెలి పారు. ఈనెల 11, 12 తేదీల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్ జూనియర్ కళాశాలలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థినుల ను సర్పంచ్ ఎంబారీ గౌతమి, హెచ్‌ఎం పోరండ్ల కిరణ్, ఉపాధ్యాయులు అభినందించారు.
వేదశ్రీ
అశ్రిత


