జగిత్యాలక్రైం: జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని పోర్ట్‌పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకాయారాను న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ గోవర్ధన్ రెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. డీఎల్‌ఎస్‌ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకట మల్లిక్ సుబ్రమణ్యం శర్మను కలిసి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, రాచకొండ శ్రీరాములు, న్యాయవాదులు పాల్గొన్నారు.
చెరువుల డిమార్కింగ్ పూర్తి చేయాలి
జగిత్యాల: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని 276 చెరువుల డిమార్కింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు ఈనెల 30లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి చెరువుకు హద్దులు, విస్తీర్ణం, భౌగోళిక స్థితి పక్కాగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.ఇరిగేషన్, ఫిషరీస్, రెవెన్యూ, ఫారెస్ట్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిమార్కింగ్ అనంతరం నివేదిక సమర్పించాలన్నారు.
ఆత్మహత్యలు నివారించాలి
జగిత్యాల: మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలను ముందుగా గుర్తిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశాఖ, మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మనశ్శాంతి లేమితో బాధపడుతున్న వారిని ఒంటరిగా వదిలేయొద్దని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య నిపుణుల సహాయం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. సహాయం కోసం టెలిమానస్ 14416 టోల్‌ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యాధికారులు రాజేందర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుభాష్, తదితరులు ఉన్నారు.
అమృత్ పనులు వేగవంతం చేయాలి
రాయికల్: పట్టణంలో అమృత్ పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. గురువారం సంబంధిత పనులను పరిశీలించారు. పథకం ద్వారా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. అనంతరం పురాతన చెన్నకేశవనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ మనోహర్‌గౌడ్ ఉన్నారు.
సామూహిక సెలవుల్లో ఈ–కంప్యూటర్ ఆపరేటర్లు


