● జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే న్యాయమూర్తులను కలిసి పరిష్కరించాలన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని సూచించారు. ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈనెల 14న జరిగే గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. డయల్ 112కు వచ్చే కాల్స్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలన్నారు. డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే యజమానులు, మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. తరచూ గొడవ పాల్పడేవారిని తహసీల్దార్ల ముందు బైండోవర్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చేతన్‌నితిన్, డీఎస్పీ రాములు, సీఐలు సుధాకర్, కరుణాకర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రాజ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సైదులు, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
అడవులను సంరక్షించాలి
అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు పోలీస్, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్, అటవీశాఖల అధికారులతో మాట్లాడారు. భూముల ఆక్రమణ, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేటగాళ్లను ఉపేక్షించొద్దన్నారు.


