న్యాయం చేయరా దేవుడా... | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయరా దేవుడా...

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

సుమన్‌, సాయికుమార్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు, నటరాజ్‌, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మూవింగ్‌ డ్రీమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై మేరుం భాస్కర్‌ నిర్మించిన ఈ మూవీ ‘పివీఆర్‌ సినిమాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ’ ద్వారా సెప్టెంబరు 4న విడుదలకానుంది. మహావీర్‌ యేలేందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘న్యాయం చేయరా దేవుడా...’ అంటూ సాగే పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ పాటకి చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, సునీత ఉపద్రస్త ఆలపించారు. ఈ పాటలో శ్రష్టి వర్మ నర్తించడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందించాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్‌ తనయుడు నంద వనమాలి,

చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement