జగిత్యాల: జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువుల్లో చేపలు మృతిచెందుతున్నాయి. డ్రైనేజీ నీరు కలవడం వల్లేనో..? లేదా విషపూరిత రసాయనాలు కలపడమో..? తెలియదుగానీ చేపలు మాత్రం చనిపోతున్నాయి. ఇటీవలి వర్షాలకు కాలువల ద్వారా నీరు చెరువుల్లోకి వెళ్లి కలుషితం అవుతున్నాయి. వెంకటాద్రినగర్ సమీపంలోని కాలువల్లో అనేక చేపలు చనిపోగా.. తాజాగా చింతకుంట చెరువులో కూడా మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనతో గంగపుత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
చింతకుంట చెరువులో
మృతిచెందిన చేపలు


