ఇది ధర్మమా? అధర్మమా? | - | Sakshi
Sakshi News home page

ఇది ధర్మమా? అధర్మమా?

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

అక్షయ్‌ ఖన్నా

‘హనుమాన్‌’ మూవీ ఫేమ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌(పీవీపీయు)లో భాగంగా రూపొందుతున్న తాజా సినిమా ‘మహాకాళి’. భూమి శెట్టి, అక్షయ్‌ ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్‌ సరాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే దుగ్గల్‌ సమర్పణలో ఆర్‌కేడీ స్టూడియోస్‌పై రివాజ్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా నటిస్తున్నారు. కాగా, ‘శుక్రాచార్య వార్‌– క్రై’ పేరుతో ‘మహాకాళి’నుంచి సోమవారం ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘అమృత మథన సమయమున దేవతలతో సమానంగా దానవులు శ్రమించినా ఆ విష్ణువు అమృతాన్ని దేవ గణానికే ప్రసాదించాడు. ఇది ధర్మమా? అధర్మమా?’, ‘యుద్ధ భీజ.. మానవజాతిని సర్వనాశనం చెయ్‌...’ వంటి డైలాగ్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాకు స్మరణ్‌ సాయి స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement