పొరపాటు.. దిద్దుబాటు | - | Sakshi
Sakshi News home page

పొరపాటు.. దిద్దుబాటు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం ● అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు ● ప్రజాధనం.. సమయం వృథా

పట్టణ శివారులో ఉన్న పెద్ద చెరువు సుందరీకరణకు అమృత్‌ 2.0 పథకం నుంచి రూ.3.15కోట్లు కేటాయించారు.

అయితే ఇక్కడ పనులు చేపట్టడానికి ముందు జల వనరుల శాఖ నుంచి అనుమతి పొందాలి. కానీ, అధికారులు అనుమతి లేకుండానే పనులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే కట్టను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఉన్న మత్తడి మార్గాన్ని సైతం కట్టలో కలిపేశారు.

ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్‌ మత్తడి తొలగింపుపై అధికారులను నిలదీశారు. దానిని పునరుద్ధరించాలని ఆదేశించారు.

దీంతో ప్రస్తుతం మత్తడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కట్టను తొలగించి పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఔట్‌గేట్‌ వద్ద పక్షం రోజుల క్రితం డ్రైనేజీ కల్వర్టు పనులు చేపట్టారు. దీనిని కూడా ఎమ్మెల్యే సంజయ్‌ పరిశీలించి నిర్మాణంలో ఉన్న లోపాలపై అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా అందులో వేసిన కాల్వ వెడల్పునకు అనుగుణంగా లేని సిమెంట్‌ పైపులను తొలగించాలని సూచించారు.

ఈ మేరకు ప్రస్తుతం ఆ పైపులను తీసివేసి పలు మార్పులతో అక్కడ పనులు నిర్వహిస్తున్నారు.

పట్టణంలోని వార్డుల్లో కోట్ల రూపాయలతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

కానీ, చాలా చోట్ల పనులు నాసిరకంగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మున్సిపల్‌ అధికారులు.. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నిబంధనలకు పాతర వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించి అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

‘ఇది మెట్‌పల్లి పట్టణం పెద్ద చెరువు వద్ద చేపడుతున్న మత్తడి పునరుద్ధరణ పనులు.

ఇటీవల అక్కడ మత్తడిని తొలగించి, దాని స్థానంలో కట్ట(బండ్‌)ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది వివాదం కావడంతో ప్రస్తుతం ఆ స్థలంలో కట్టను తొలగించి తిరిగి తాత్కాలికంగా మత్తడిని పునరుద్ధరిస్తున్నారు. ప్రణాళిక లేకుండా అధికారులు ఇలా అనాలోచితంగా అభివృద్ధి పనులు చేపడుతుండడంతో సమయం వృథా కావడమే కాకుండా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది’.

కేంద్రీయ విద్యాలయం ప్రవేశ తేదీల మార్పు

జగిత్యాలజోన్‌: జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచి నిర్వహించే కేంద్రీయ విద్యాలయం ప్రవేశాల తేదీని మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు బాలవాటిక 1,2,3వ తరగతులకు, 27న 11 గంటలకు 1 నుంచి 5వ తరగతి ప్రవేశాలకు ప్రత్యక్షంగా లాటరీ తీయనున్నట్లు ప్రకటించారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న తల్లితండ్రులు గమనించాలని కోరారు.

మెట్‌పల్లి: సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో విధాలుగా ఆలోచిస్తాం. ముందుగా అనువైన స్థలా న్ని ఎంపిక చేసుకొని ఆ తర్వాత ఇంజినీర్‌ ప్లాన్‌తో అవసరమైన అన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభిస్తాం. నిర్మాణం జరుగుతున్నంత కాలం ద గ్గురుండి పరిశీలిస్తూ ప్రతీ దానికి జాగ్రత్తగా డబ్బులు వెచ్చిస్తాం. ఎందుకంటే ఖర్చు చేసేది మన కష్టార్జితం కాబట్టి. కానీ, ఇదే శ్రద్ధ మున్సిపాలిటీలో ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎందుకు కనిపించడంలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘పోయేది మా సొమ్ము కాదు కదా’ అని అధికారులు భా విస్తుండడం వల్ల పనుల్లో ఎన్నో లోపాలు ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మెట్‌పల్లి పట్టణంలో ఇటీవల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ సమయంలో అందులో లోపాలను గుర్తించి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

పెద్ద చెరువు.. అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ

బస్టాండ్‌ ఔట్‌గేట్‌ కల్వర్టు పనుల్లోనూ అంతే..

నిబంధనలు బేఖాతరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement