నిఘాపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిఘాపై నిర్లక్ష్యం

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● అంజన్న సన్నిధిలో సీసీ కెమెరాల మరమ్మతుపై పట్టింపు కరువు ● పలుచోట్ల ఆరునెలలుగా పనిచేయని కెమెరాలు

మల్యాల: కొండగట్టు అంజన్న భక్తుల భద్రతతోపాటు, ఆలయ పరిసరాల్లో నిత్యం నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఆలయ పరిసరాల్లో 13 సీసీ కెమెరాలు ఆరు నెలలకుపైగా పనిచేయకపోవడంతో నిఘా కరువైంది. నిత్యం కొండగట్టుకు వచ్చే వేలాదిమంది భక్తులకు భద్రత కల్పించటంతోపాటు, గతంలో ఆలయంలో చోరీ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరగడంతో ఆలయ పరిసరాల్లో 64 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

మెట్లదారి వెంట..

కొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకునేందుకు మెట్లదారి వెంట వచ్చే భక్తులు వానరాల బెడదతో తరచూ ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు మెట్లదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఆ దారి గుండా వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మెట్లదారి వెంట పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని భక్తులు కోరుతున్నారు.

పనిచేయని 13 కెమెరాలు

కొండగట్టు ఆలయ పరిసరాల్లో 64 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతపై పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆలయ గర్భగుడి, మంటపం, కోనేరు, అన్నదాన సత్రం, లడ్డూల తయారీ కేంద్రం, క్యూలైన్లు, పాత కోనేరు, కల్యాణకట్ట, ఆలయ కార్యాలయం, పార్కింగ్‌ స్థలం, ప్రసాదాల పంపిణీ, భక్తులు నడిచే దారి తదితర ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పలుచోట్ల 13 సీసీ కెమెరాలు ఆరు నెలలకుపైగా పనిచేయడం లేదు.

మరమ్మతు చేయిస్తాం

కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తాం. వానరాలతో తరచూ సీసీ కెమెరాలు మరమ్మతుకు గురవుతున్నాయి. పనిచేయని కెమెరాలకు మరమ్మతు చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తాం.

– హరిహరనాథ్‌, ఆలయ ఏఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement