అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం అంతర్గాంలో మారపెల్లి వినోద–సురేశ్‌, సారంగాపూర్‌ మండలం బట్టపల్లికి చెందిన అమ్మాయి–భూమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఆదివారం హాజరై మాట్లాడారు. గ్రామాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పెన్షన్లు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నోముల రమ్య శేఖర్‌రెడ్డి, నాయకులు బోనగిరి నారాయణ, నక్కల రవీందర్‌రెడ్డి, స్వామిరెడ్డి, శ్రీనివాస్‌, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement