హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

జగిత్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వృద్ధుల పింఛన్‌ రూ.4వేలకు పెంచుతామని, ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తున్నా ఒక్కటీ అమలు చేయడంలేదన్నారు. ఆసరా పింఛన్‌ రూ.200 ఉంటే కేసీఆర్‌ రూ.2వేలకు పెంచారని గుర్తు చేశారు. తాజా ప్రభుత్వం మాత్రం ఏడు రకాల పింఛన్లలో వృద్ధాప్య, బీడీకార్మిక పెన్ష న్‌ చేర్చలేదని విమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు రేవంత్‌రెడ్డి పనితీరుకు చెంపపెట్టన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, శీలం ప్రవీణ్‌కుమార్‌, మల్లేశం, గాజుల రాజేందర్‌, మున్న, దుర్గయ్య, రాము, హరీశ్‌, సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మాజీమంత్రి జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement