జగిత్యాల: అర్హులందరికీ పింఛన్లు అందించడమే లక్ష్యమని, ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, తలసేమియా బాధితులకు పింఛన్లు మంజూరవుతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,18,002 మంది లబ్ధిదారులకు ప్రతినెలా సుమారు రూ.47 కోట్ల పింఛన్ అందుతోందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు. ముందుగా సీనియర్ సిటిజన్స్ ముద్రించిన వృద్ధుల రక్షణ చట్టం పుస్తకాలను ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హన్మంతరెడ్డి, బొల్లం విజయ్, విశ్వనాథం, ప్రకాశ్‌రావు, అశోక్‌రావు పాల్గొన్నారు.
మారనున్న ధర్మపురి రూపురేఖలు
ధర్మపురి: ధర్మపురిలో చేపడుతున్న అభివృద్ధి పనులతో రూపురేఖలు మారుతున్నాయని మంత్రి అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో అంబేడ్కర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.117 కోట్లు కేటాయించిందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులున్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వెల్గటూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. 80 మంది లబ్దిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఏఎంసీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


