ఉపాధి హామీ కార్యాలయంలో..
ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు
● వేళకు రాని ఎంపీడీవో కార్యాలయం అధికారులు
కోరుట్లరూరల్: ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించడం లేదు. కోరుట్ల ఎంపీడీవో కార్యాలయం అధికారులు ఉదయం 10 గంటలకే విధులకు హాజరుకావాల్సి ఉన్నా.. పదిన్నర దాటినా ఏ ఒక్కరూ రాలేదు. దీంతో వివిధ పనుల కోసం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది. కార్యాలయ సూపరింటెండెంట్ కరీంనగర్ నుంచి రాకపోకలు సాగిస్తూ.. సమయానికి కార్యాలయానికి చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది కూడా పదిన్నర దాటినా విధుల్లో కనిపించలేదు. పంచాయితీ రాజ్ కార్యాలయమైతే 11 గంటల వరకు తెరుచుకోలేదు. సబ్ ట్రెజరీ కార్యాలయం 10.15గంటల వరకు తీయలేదు. అధికారులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియక జనాలు ఇబ్బంది పడ్డారు.
పదిన్నర దాటినా తెరుచుకోని సబ్ ట్రెజరీ కార్యాలయం, మూసి ఉన్న పంచాయతీ రాజ్ కార్యాలయం


