ధర్మపురి: ఎంపీగా వంశీకృష్ణ ధర్మపురిలో నయాపైసా పనిచేయలేదని, ఆయన కనిపించడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు పోస్టర్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. రెండేళ్లలో ధర్మపురికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు నమ్మి ఓటువేసి గెలిపిస్తే మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ధర్మపురిలో శాశ్వత పోస్టాఫీస్ కావాలని ఎంపీకి వినతిపత్రం ఇచ్చి రెండేళ్లు గడిచిందని, ఇప్పటివరకు దానిపై ఊసే లేదని గుర్తు చేశారు. అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి సుమారు రూ.250 కోట్లు, ఎంపీ ల్యాడ్స్ కింద సుమారు రూ.15కోట్లు, పీఎంఏవై నిధులు, జల్ జీవన్ మిషన్, ఎన్‌హెచ్‌ఏఐ నిధులు వస్తున్నా.. ఒక్క పని చేయలేదని, వాటిపై శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గాజు భాస్కర్, లవన్‌కుమార్, పల్లెర్ల సురేందర్, తదితరులున్నారు.


