తిరుచానూరుకు ప్రత్యేక రైలు | - | Sakshi
Sakshi News home page

తిరుచానూరుకు ప్రత్యేక రైలు

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

రామగుండం: తిరుమల తిరుపతి వెళ్లు శ్రీవారి భక్తులకు ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల ప్రజల సౌకర్యార్థం మరో ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక రైలును జూలై 21 నుంచి ఆగస్టు 25 వరకు నాందేడ్‌–తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుగా నడిపించనున్నారు. ఈ రైలు వారానికి ఒక ట్రిప్పు చొప్పున మొత్తం ఆరు ట్రిప్పులు రాకపోకలు సాగించనుంది. రైలు నం.07604 తిరునాచూర్‌–నాందేడ్‌, రైలు నం.07603 నాందేడ్‌–తిరుచానూరు మధ్య నడిచే ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

చోరీకి యత్నించిన ఇద్దరి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: సారంగాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన దువ్వాక రజిత మెడలోంచి బంగారు పుస్తెల తాడు దొంగిలించేందుకు యత్నించిన ఇద్దరిని శుక్రవారం అరెస్ట్‌ చేశామని జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌ తెలిపారు. రజిత ఈనెల 14న తన హోటల్‌లో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అంబార్‌ కావాలని అడిగి, ఆమె కళ్లలో కారంపొడి చల్లి పుస్తెలతాడు చోరీకి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై గీత కేసు నమోదు చేశారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్‌ గ్రామానికి చెందిన చింత రమణ, ఎనగందుల వినయ్‌ అనుమానస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేశామన్నారు.

ఎయిర్‌ హోస్టెస్‌, ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌ శిక్షణకు దరఖాస్తులు

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎస్‌సీ, ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అర్హులైన అవివాహిత బాలికలకు ఆరు నెలల ఎయిర్‌ హోస్టెస్‌, ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ.సురేశ్‌ తెలిపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణకు 17–24 ఏళ్ల వయస్సు గల జిల్లా బాలికలు మాత్రమే అర్హులని అన్నారు. శిక్షణ మొత్తం ఫీజు రూ.1.42 లక్షలు కాగా, ఇందులో రూ.1.09 లక్షలను కలెక్టర్‌ భరిస్తారని తెలిపారు. అభ్యర్థులు హాస్టల్‌ ఫీజుగా నెలకు రూ.5,500 చొప్పున ఆరు నెలలకు రూ.33 వేల మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. శిక్షణ పూర్తయిన అనంతరం అర్హత సాధించిన వారికి విమానాశ్రయాల్లో పాసెంజర్‌ సర్వీస్‌ అసిస్టెంట్‌, బగ్గజ్‌ హ్యాండలింగ్‌ సర్వీస్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99639 60063, 86881 06554 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement