రమణీయం.. రామయ్య రథోత్సవం
పెగడపల్లి: మండలంలోని నంచర్ల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఐదురోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవ మూర్తులను రథంపైకి తెచ్చి ఆలయం చుట్టూ సప్తహవాలతో జైశ్రీరాం..జై శ్రీరాం నినాదాలతో రథోత్సవం నిర్వహించారు.వ రామనామ భక్తుల నినాదాలు, నృత్యాలతో ఆలయ ఆవరణ మార్మోగింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొత్త జైపాల్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పాల్గొన్నారు.


