కాంగ్రెస్‌ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..? | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?

Apr 11 2025 1:07 AM | Updated on Apr 11 2025 1:07 AM

కాంగ్రెస్‌ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?

కాంగ్రెస్‌ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?

● రాజ్యాంగ పరిరక్షణపై మాట్లాడితే సంజయ్‌కి ఉలుకెందుకు.. ● రాహుల్‌ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా.. ● మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: రాహుల్‌గాంధీ ఆలోచన విధానమైన జైభీం, జైబాపు, జైసంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నైతిక విలువలపై తాను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ఉలికి పాటెందుకని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తనది కాంగ్రెస్‌ కుటుంబమంటున్న సంజ య్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడని, అభివృద్ధి కోసమైతే ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి పోరాడిన అసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు దక్కాల్సిన గౌరవం పరాయి వాళ్లకు దక్కుతుండడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా సంజయ్‌ ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి రౌడీషీట్లు నమోదు చేయించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నా రు. పార్టీ మారని కాంగ్రెస్‌ సర్పంచులను సస్పెండ్‌ చేయించిన చరిత్ర సంజయ్‌దన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల వేధింపులతో హబ్సీపూర్‌ గ్రామానికి చెందిన శివనాగ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తాను పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని సంజయ్‌ తెలుసుకోవాలన్నారు. బండ శంకర్‌, గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, గాజంగి నందయ్య, చందా రాధాకిషన్‌, జగదీశ్వర్‌, రఘువీర్‌గౌడ్‌, గుండ మధు, ముకేష్‌ఖన్నా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement