జగిత్యాలక్రైం: ఓట్ల లెక్కింపు సందర్భంగా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న వీఆర్‌కే కళాశాలలో కౌంటింగ్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కరీంనగర్–జగిత్యాల వాహనాలను నూకపల్లి క్రాస్‌రోడ్ నుంచి రామన్నపేట, పోతారం మీదుగా జగిత్యాలకు దారి మళ్లించామని, జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లే భారీ వాహనాలను ధరూర్ బైపాస్ మీదుగా గొల్లపల్లి, ధర్మారం వైపు దారి మళ్లించామని తెలిపారు. ఇతర వాహనాలు నూకపల్లి డబుల్‌బెడ్‌రూం ఇళ్లమీదుగా మల్యాల క్రాస్‌రోడ్‌కు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ విధుల కోసం వచ్చే వాహనదారులు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను ఉంచాలని సూచించారు.