TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి | - | Sakshi
Sakshi News home page

TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి

Oct 12 2023 5:08 AM | Updated on Oct 12 2023 1:52 PM

- - Sakshi

మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: బీజేపీ అసెంబ్లీ స్థానం నుంచి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వైద్యురాలు, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేసిన అనుభవం ఉండటంతో పార్టీ ఆమెకు టికెట్‌ ఇచ్చే యోచనలో ఉందని కమలనాథులు చెబుతున్నారు.

వాస్తవానికి శ్రావణి చేరిక సమయంలోనే ఆమెకు పార్టీ నుంచి టికెట్‌ హామీ దక్కిందని ప్రచారం జరిగింది. అధిష్టానం ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement