రాత్రి సమయంలో మహిళల్ని కార్లలో తరలిస్తున్న దృశ్యం
వైఎస్సార్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజైన ఆదివారం(నవంబర్ 1వ తేదీ) పులివెందులలో భారీ కుట్రకు తెరలేపడానికి టీడీపీ సన్నద్ధమైంది. భారీగా దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళల్ని దించుతూ మరో అరాచకానికి ఒడిగట్టేందుకు టీడీపీ నేతలు పూనుకుంటున్నారు.
వేముల నుంచి రాత్రికి రాత్రి మహిళలను తరలిస్తున్నారు టీడీపీ నేతలు. ఒక్కో దొంగ ఓటరుకు రూ. 1500 ఇచ్చి మరీ దింపుతున్నారు. ఆదినారాయణరెడ్డి వర్గం కూడా దొంగ ఓట్లు వేయించేందుకు మహిళల్ని తరలిస్తుంది వీరిని రేపు పోలింగ్ నాడు పెద్ద ఎత్తున క్యూలో దొంగ ఓట్లు వేయడానికి సిద్ధం చేశారు. మరొకవైపు అల్లర్లు సృష్టించేందుకు ముందుగానే మూకలను సిద్దం చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు దొంగ ఓట్లు వేయించడానికి పన్నాగం రచించింది.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ


