
ఈవిడ ఎవరన్నది మీరు మర్చిపోయి ఉంటారు.. నాలుగేళ్ల క్రితం మీడియాలో మార్మోగిన పేరు.. హలీమా.. గంపెడు సంతానానికి కేరాఫ్ అడ్రస్. ఈ పిల్లలూ మామూళోళ్లు కారు.. రికార్డు బ్రేకింగ్ పిల్లలు. నాలుగేళ్ల క్రితం ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి.. మాలీ దేశానికి చెందిన హలీమా గిన్నిస్ రికార్డు సాధించారు. 9 మంది పుట్టడం రికార్డైతే.. అందరూ బతికిబట్టకట్టడం.. ఇదిగో ఇప్పుడిలా నాలుగో జన్మదినాన్ని జరుపుకోవడం అరుదైన విషయమేకదా.. ఈ సందర్భంగా తండ్రి అర్బీ, తల్లి హలీమాతో వారు దిగిన ఈ ఫొటోను గిన్నిస్ బుక్ తన వెబ్‌సైట్లో షేర్ చేసుకుంది.
సర్పానికి చికిత్స
అచ్చంపేట రూరల్: గాయపడిన ఒక సర్పానికి వెటర్నరీ వైద్యుడు చికిత్స చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం సమీపంలోని కోళ్లఫారం వద్ద కొన్నిరోజులుగా పెద్ద పాము సంచరిస్తుండడంతో.. యజమాని స్నేక్‌క్యాచర్ సుమన్‌కు సమాచారం అందించాడు. శుక్రవారం కోళ్లఫారం వద్ద పామును పట్టుకునే క్రమంలో.. అతని వద్ద ఉన్న పరికరం గుచ్చుకుని పాముకి గాయమైంది. వెంటనే ఆయన పామును అచ్చంపేటలోని పశువుల ఆస్పత్రికి తీసుకురాగా.. వెటర్నరీ వైద్యుడు హరీశ్ చికిత్స చేశారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు.