
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో మారణాయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని బలగాలు కాల్చి చంపాయి. వైట్ హౌస్ ఎబ్లాక్ కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతని వద్ద గన్ తో పాటు పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని షూట్ చేసి చంపారు.
భారత కాలమాన ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం అతను అనుమనాస్పద రీతిలో వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. అతనిపై ఒక్కసారిగా కాల్పులకు దిగి మట్టుబట్టాయి. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
తొలుత ఆతన్ని నివారించే క్రమంలో ఎదురుకాల్పులకు దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే ఒక్కసారిగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరూ గాయపడలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో లేరని, ఫ్లోరిడాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే అతనే ఏ ఉద్దేశంతో మారణాయుధాలతో అక్కడకు వచ్చాడనేది తెలియలేదన్నాయి,
Comments
Please login to add a commentAdd a comment