ఉక్రెయిన్‌ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు | Ukrainian embassies receive bloody packages containing animal eyes, letter bombs | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు

Dec 4 2022 6:35 AM | Updated on Dec 4 2022 6:35 AM

Ukrainian embassies receive bloody packages containing animal eyes, letter bombs - Sakshi

కీవ్‌: వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్‌ బాంబులు, ఉత్తుత్తి లెటర్‌ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్‌ ఎంబసీకి శుక్రవారం జంతువుల కళ్లతో కూడిన పార్శిల్‌ అందింది.

ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్‌ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్‌ సిటీలోని ఉక్రెయిన్‌ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్‌ ఎంబసీకి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది. గత వారం స్పెయిన్‌ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్‌ బాంబులు అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement