breaking news
Letter Bombs Explode
-
ఉక్రెయిన్ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు
కీవ్: వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్ బాంబులు, ఉత్తుత్తి లెటర్ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతువుల కళ్లతో కూడిన పార్శిల్ అందింది. ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్ సిటీలోని ఉక్రెయిన్ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్ ఎంబసీకి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్ ఆదేశించింది. గత వారం స్పెయిన్ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్ బాంబులు అందాయి. -
లెటర్ బాంబులు పేలి ఆరుగురి మృతి
బీజింగ్: చైనాలో లెటర్ బాంబులు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. బుధవారం చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులతో సహా పదికిపైగా ప్రాంతాల్లో 15 లెటర్ బాంబులు పేలాయి. చైనా జాతీయ దినోత్సవం నాడు ఈ దుర్ఘటన జరిగింది. స్వీడ్ డెలివరీ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లో లెటర్ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలిపోగా, రోడ్డుపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.