బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా | UK PM Keir Starmer expected to announce his resignation | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా

Jun 22 2026 2:16 PM | Updated on Jun 22 2026 4:38 PM

UK PM Keir Starmer expected to announce his resignation

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా చేశారు. స్టార్మర్‌ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 24గంటల్లో కీర్‌ స్టార్మర్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2024లో బ్రిటన్ ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌ ప్రధానిగా రాజీనామా చేశారు. కీర్‌ స్టార్మర్‌తో కలిపి పదేళ్లలో ఆరుగురు ప్రధానులు తమ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

రాజీనామాకు ముందు స్టార్మర్ తన భార్యతో కలిసి 10డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఆయన మద్దతు దారులు హర్షధ్వానాలు, చప్పట్లుతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన క్షణాన్ని తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణంగా కీర్‌ స్టార్మర్‌ గుర్తుచేసుకున్నారు.

స్టార్మర్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించానని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సాధించిన అఖండ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, పెరిగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తగ్గుతున్న ఎన్‌హెచ్‌ఎస్ నిరీక్షణ జాబితాలు, కార్మికులు, అద్దెదారుల హక్కులు, రక్షణ వ్యయం పెరుగుదల వంటి అంశాలను వివరించారు.

నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తొలి ప్రాధాన్యత దేశానికే. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అభివృద్ధిలో మా సహచర దేశాల కంటే వేగంగా వృద్ధి సాధించాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా ద్రవ్యోల్బణం కంటే వేగంగా వేతనాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో తమ విధానాల వల్ల ఐదు లక్షల మంది పిల్లలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చామని కూడా పేర్కొన్నారు.

అయితే, వరుస వివాదాలు, విధాన మార్పులు, తగ్గుతున్న ప్రజా మద్దతు కారణంగా స్టార్మర్ ప్రధాని పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జీవన ప్రమాణాల మెరుగుదలను అందించడంలో ఆయన ప్రభుత్వం విఫలమైందని అంతర్గతంగా లేబర్ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి.

దీనికితోడు లేబర్ పార్టీ ప్రత్యర్థి ఆండీ బర్న్‌హామ్ పార్లమెంటరీ సీటు గెలుచుకోవడంతో కీర్‌ రాజీనామాపై మరింత ఒత్తిడి పెరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో 100 మందికి పైగా లేబర్ చట్టసభ్యులు ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయన నిష్క్రమణకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు.

ప్రజా సేవలపై ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, అక్రమ వలసలు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాల అసమర్థతపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతిబింబిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement