యూకే రక్షణ మంత్రి జాన్‌ హీలే రాజీనామా | UK defence minister resigns after clash with PM Keir Starmer | Sakshi
Sakshi News home page

యూకే రక్షణ మంత్రి జాన్‌ హీలే రాజీనామా

Jun 12 2026 5:03 AM | Updated on Jun 12 2026 5:03 AM

UK defence minister resigns after clash with PM Keir Starmer

లండన్‌: యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రక్షణ మంత్రి జాన్‌ హీలే గురువారం పదవికి రాజీనామా చేశారు. రక్షణ బడ్జెట్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరో దారి లేకనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత రక్షణ బడ్జెట్‌తో భద్రతా బలగాల అవసరాలు ఏమాత్రం తీరవని, ఫలితంగా దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని జాన్‌ హీలే ఆందోళన వ్యక్తం చేశారు.

 ప్రధాని స్టార్మర్‌ గానీ, ఆర్థిక మంత్రి గానీ దేశ భద్రతకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్‌ జలసంధి వద్ద మిలటరీ మిషన్, నాటో ఆర్కిటిక్‌ సెంట్రీ మిషన్, యూకేతోపాటు నాటోపై ఎక్కువైన రష్యా దూకుడు వంటి వాటి నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ అవసరాలు పెరిగాయని జాన్‌ హీలే వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement