ట్రంప్‌కు కోర్టు మరో షాక్ | Trump Federal Aid Order Stayed By Washington Court | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కోర్టు మరో షాక్‌.. సాయం నిలిపివేత ఆదేశాలపై స్టే

Jan 29 2025 7:44 AM | Updated on Jan 29 2025 7:44 AM

Trump Federal Aid Order Stayed By Washington Court

వాషింగ్టన్‌:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు నిర్ణయాలకు అక్కడి కోర్టులు వరుస బ్రేకులు వేస్తున్నాయి. ఉదార కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై వాషింగ్టన్‌ జిల్లా కోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ట్రంప్‌ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు విచారణను వారంపాటు వాయిదా వేసింది.

ట్రంప్‌ ఆదేశాల చట్టబద్ధతను విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. విదేశాలు, స్వచ్ఛంధ సంస్థలు,పలు కార్యక్రమాల కింద సాయాన్ని మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారు.ఈ ఆదేశాలపై వాషింగ్టన్‌ కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. 

కాగా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల నుంచి చుక్కెదురవడం ఇది రెండోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్‌ జారీ చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆదేశాలను కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement