List Of Top 5 Deepest Sinkhole in the World Details With Photos Inside - Sakshi
Sakshi News home page

Top 5 Deepest Sinkholes: లోతైన 5 సింక్‌హోల్స్‌.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం..

Aug 8 2023 8:50 AM | Updated on Aug 8 2023 9:49 AM

Top 5 Deepest Sinkhole in the World - Sakshi

భూమి ఉపరితలం కింద ఉన్న రాళ్లు సహజంగా భూగర్భ జలాల్లో కరిగిపోయినప్పుడు సింక్ హోల్స్ ఏర్పడతాయి. ఇలా రాళ్ళు కరిగిపోతున్నప్పుడు, భూమి లోపల గుహలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గుహ పై భాగంలోని నేల బరువును తట్టుకోలేనప్పుడు, అది కూలిపోతుంది. అప్పుడు భారీ సింక్‌హోల్‌ ఏర్పడుతుంది. అయితే దానిలోనూ పర్యావరణ వ్యవస్థ అలానే ఉంటుంది. అలాంటి ఐదు లోతైన సింక్ హోల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జియా ఓఝాయీ టియాంకెంగ్, చైనా
చైనాలోని ఫెంగ్జీ కౌంటీలో జియా ఓఝాయీ టియాంకెంగ్‌లో అతిపెద్ద సింక్‌హోల్‌ ఉంది. ఈ సింక్ హోల్‌కు పిట్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టారు. ఇది 662 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన సింక్ హోల్‌గా గుర్తింపు పొందింది.

బయూ కార్న్‌ సింక్‌హోల్‌, అమెరికా
ఇది అమెరికాలోని లూసియానాలో ఉంది. 2012లో భూకంపాలు సంభవించిన సమయంలో ఇది బయటపడింది. భూగర్భంలోని ఉప్పు దిబ్బ కూలిపోవడంతో ఈ సింక్ హోల్ ఏర్పడింది. 2014 నాటికి ఇది 229 మీటర్ల లోతు కలిగివుంది.

కాపర్ మైన్ సింక్‌హోల్, చిలీ
2020, జూలైలో చిలీలో ఒక సింక్ హోల్ బయటపడింది. ఇది 32 మీటర్ల చుట్టుకొలతతో 200 మీటర్ల లోతున ఉందని అంచనా. ఈ సింక్ హోల్ రాగి గనుల సమీపంలో ఏర్పడింది.

మిస్టరీ సింక్‌ హోల్‌, చైనా
2022లో చైనా శాస్త్రవేత్తలు గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో 192 మీటర్ల లోతైన సింక్‌హోల్‌ను కనుగొన్నారు. ఇది 306 మీటర్ల లోతు, 150 మీటర్ల వెడల్పుతో ఉంది. అది ఎంత పెద్దదంటే దానిలోపల పెద్ద అడవి వ్యాపించింది.

గ్రేట్‌ బ్లూ హోల్‌, అమెరికా
గ్రేట్ బ్లూ హోల్ సముద్రంలో ఉంది. ఇది అమెరికాలోని బెలిజ్ తీరంలో ఉంది. ఇది 124 మీటర్ల లోతు కలిగివుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన బెలిజ్ బారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టమ్‌లో భాగంగా ఉంది.


ఇది కూడా చదవండి: పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement