మిట్టల్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం

Sunil Bharti Mittal first Indian to get Honorary Knighthood from King Charles III - Sakshi

లండన్‌/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్‌ భారతీ మిట్టల్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్‌ కమాండర్‌ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్‌ రాణి మరణం తర్వాత బ్రిటన్‌ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్‌–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్‌ మిట్టల్‌ రికార్డు సృష్టించారు.

బ్రిటన్, భారత్‌ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్‌(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్‌ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్‌ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్‌ కమాండర్‌ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top