
కొత్త వ్యోమగాముల ఎంపికలో మహిళల హవా
వాషింగ్టన్: ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామణులు ఇప్పుడు అమెరికా వారి ప్రతిష్టాత్మక నాసా నూతన వ్యోమగాముల రేసులోనూ ముందంజలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా భౌతిక,రసాయన, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులైన నూతన తరం వ్యోమగామి అభ్యర్థుల నుంచి తొలి పది మందిని నాసా ఎంపికచేయగా వారిలో ఆరుగురు మహిళలే కావడం విశేషం. ప్రపంచదేశాల నుంచి 8,000 దరఖాస్తులు రాగా వారిలో నుంచి అత్యంత నైపుణ్యం కనబరిచిన ఈ పది మందిని తుది జాబితాగా నాసా ఎంపికచేసి ప్రకటించింది.
హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్‌సెంటర్ కార్యాలయంలో ‘2025 క్లాస్’టాప్–10 కొత్త వ్యోమగామి అభ్యర్థులను నాసా తాత్కాలిక చీఫ్ సీన్ డఫీ అందరికీ పరిచయం చేశారు. బెన్ బెయిలీ, లారెన్ ఎడ్గర్, ఆడమ్ ఫర్మాన్, కేమరాన్ జోన్స్, యూరీ కూబో, రెబెక్కా లాలెర్, అన్నా మీనన్, ఇమెల్డా ముల్లర్, ఎరిన్ ఒవర్‌క్యా‹Ù, క్యాథరిన్ స్పీస్‌లను ఎంపికచేశారు. ఈ సందర్భంగా ఈ కాబోయే వ్యోమగాములను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు.
నవ్య పరిశోధనలతో మానవాళి మేథస్సును మార్స్, చంద్రుని ఆవలకు తీసుకెళ్తున్న అత్యంత ప్రతిభాశాలులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు నూతన ప్రతినిధులుగా వీళ్లంతా వెలుగొందబోతున్నారు. తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు అహరి్నశలు కృషిచేయబోతున్నారు. ఇప్పుడు మీముందు నిల్చున్న వీళ్లంతా తమ వృత్తి ప్రస్తానాన్ని ఎక్కడ, ఎలా ప్రారంభించారనేది ముఖ్యం కాదు. అమెరికా గడ్డపై శిక్షణ పొంది ఆకాశమే హద్దుగా తమ కలలన నెరవేర్చుకుంటూ ఎంతటి ఘనతలు సాధించబోతున్నారు అనేదే ప్రధానం ’’అని సీన్ డఫీ అన్నారు.
బుధగ్రహంపై పరిశోధన కోసం నాసా దశాబ్దాల క్రితం మెర్క్యురీ సెవన్ పేరిట ఏడుగురు వ్యోమగాముల బృందాన్ని తొలిసారిగా ప్రకటించింది. ఆనాటి నుంచి చూస్తే ఈ బాŠయ్చ్ 24వది. ఈ కొత్త బ్యాచ్ ఆశావహ వ్యోమగాములు వచ్చే రెండేళ్లపాటు అత్యంత కఠినమైన వ్యోమగామి శిక్షణ తీసుకోబోతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, రోబోటిక్స్, జియోలజీ, విదేశీ బాషలపై పట్టు, వైద్యం, అత్యయిక సందర్భాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలా ప్రతిస్పందించాలి వంటి ఎన్నో అంశాల్లో వీళ్లకు నాసా సీనియర్లు తరీ్ఫదు ఇవ్వనున్నారు. చంద్రునిపై నాసా చేపట్టబోయే ప్రతిష్టాత్మక ఆర్టీమిస్ మిషన్లలో వీళ్లను త్వరలో భాగస్వాములుగా చేయనున్నారు.