బ్రెజిల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు | Six dead as two helicopters collide in Brazil | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు

Jun 15 2026 2:01 AM | Updated on Jun 15 2026 2:01 AM

Six dead as two helicopters collide in Brazil

ఆరుగురి దుర్మరణం

రియో డీ జనీరియో: బ్రెజిల్‌లో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అనూహ్యంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాటిలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రియో డీ జనీరియో నగరం పశ్చిమం వైపు గగనతలంలో ఈ ఘటన జరిగింది.

కూలిన హెలికాప్టర్‌ ఒకటి నేరుగా ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూమ్‌పై పడింది. దీంతో వాహనాలు దిగ్ధమయ్యాయి. విషయం తెల్సి అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. హెలికాప్టర్లు ఢీకొనడానికి సాంకేతిక లోపమా? లేదా పైలట్ల తప్పిదమా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఘటనపై బ్రెజిల్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement