‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’ | Seafarers Claim Only Indians Being Attacked In Gulf | Sakshi
Sakshi News home page

‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’

Jun 14 2026 7:19 PM | Updated on Jun 14 2026 7:29 PM

Seafarers Claim Only Indians Being Attacked In Gulf

గల్ఫ్‌ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నారని  ఇరాన్‌లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఒమన్‌ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడగా, ఆ భయానక వాతావరణం ఇంకా కొనసాగుతుందని పలువురు భారత నౌకాదళ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

భారతీయ నావికులను తీసుకువెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. కొనసాగుతున్న దాడుల మధ్య తాము ఆ ప్రాంతంలో చిక్కుకుపోయామని, అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆపదలో ఉన్న భారతీయ నావికుల పరిస్థితిని వివరించారు. 

‘ మేము ఇరాన్‌లో ఉన్నాము, ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మమ్మల్ని మాకు సంబంధంలేని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు? మేము సైనిక సిబ్బంది కాదు. మేము కాంట్రాక్టులపై పనిచేస్తున్న నావికులం. మేము చమురును తీసుకువస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాం’ అని వీడియో రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము సైనికులం కాదు. మేము కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి వస్తాం. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు? మా తప్పేంటి?" అని ప్రశ్నించారు.  ఇటీవల దాడికి గురైన ఒక నౌకలో తాను గతంలో పనిచేశానని, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆ నౌకాదళంలోని మరో కాంట్రాక్ట్‌ కార్మికుడు ప్రస్తావించాడు. 


 

 

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement