ఫిలిప్పీన్స్ సమీప సముద్రంలో చేపలు పడుతున్న జెస్సర్ సెర్వాంటెస్ అనే మత్స్యకారుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. గత నెలలో ఆయన ఒక చిన్న చెక్క పడవలో చేపలు పడుతుండగా, ఒక ఆక్టోపస్ దొరికింది. అయితే, దాన్ని పడవలోకి తీసుకున్న మరుక్షణమే అది ఒక్కసారిగా ఆయన ముఖంపైకి ఎగబాకి, తన బలమైన టెంటకిల్స్‌తో (చేతులు) తలను గట్టిగా చుట్టేసింది.
ఆక్టోపస్ టెంటకిల్స్‌కు ఉండే శక్తివంతమైన వ్యాక్యూమ్ కప్పులు ఆయన ముఖానికి గట్టిగా అంటుకోవడంతో దాన్ని తొలగించడం చాలా కష్టమైంది. ఒక దశలో అది ఆయన నోరు, ముక్కును కూడా పూర్తిగా కప్పేయడంతో ఊపిరి ఆడక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.ఆ ప్రాణాంతక పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి సెర్వాంటెస్ ఒక వెదురు కర్ర ముక్కను తీసుకుని ఆక్టోపస్‌పై పలుమార్లు కొట్టాడు.
కాసేపటి తర్వాత దాని పట్టు సడలడంతో, చివరకు దాన్ని ముఖం నుంచి వేరు చేయగలిగాడు. అనంతరం ఆ ఆక్టోపస్‌ను తిరిగి సముద్రపు నీటిలోకి వదిలేశాడు. ఈ భయానక ఘటన తర్వాత ఆయన తీవ్ర భయాందోళనతో ఊపిరి పీల్చుకుంటూ కనిపించారు.ఈ భయంకర అనుభవాన్ని సెర్వాంటెస్ వివరిస్తూ.. తాను పట్టుకున్న ఆక్టోపస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైందని, అది తన ముఖాన్ని చీల్చేసేంత బలంగా పట్టుకుందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
Octopus refuses to let go of fisherman face pic.twitter.com/sTEBbz2aXz
— Heidi (@Heidi3614645017) August 17, 2026


