ఫేమస్ కాశీ 'గంగా హారతి' ఇప్పుడు లండన్‌లో | Kashi Ganga Aarti Now London Thames River | Sakshi
Sakshi News home page

Ganga Harathi-London: 'గంగా హారతి' ఇప్పుడు థేమ్స్ నది ఒడ్డున

Aug 18 2026 11:59 PM | Updated on Aug 19 2026 12:00 AM

Kashi Ganga Aarti Now London Thames River

'గంగా హారతి' అనగానే మనకు కాశీ పుణ్యక్షేత్రమే గుర్తొస్తుంది. ప్రతి సాయంత్రం నిర్వహించే ఈ సంప్రదాయం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతోంది. వారణాసి, హరిద్వార్, రిషికేశ్ ఘాట్లలో దర్శనమిచ్చే ఈ హారతిని ఇప్పుడు తొలిసారి లండన్‌లోని థేమ్స్ నది తీరంలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. చిన్మయ మిషన్ యూకే, టోటల్లీ థేమ్స్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వచ్చే నెల 13న లండన్‌లోని ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్, గ్రీన్‌విచ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రత్యక్ష సంగీత, డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమైన గంగా హారతి సూర్యాస్తమయం సమయంలో రాయల్ స్టెప్స్ దగ్గర సాయంత్రం 7:15 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ పూలు, విగ్రహాలు లేదా ఇతర పూజా సామగ్రిని థేమ్స్ నదిలో వేయడానికి అనుమతి లేదు. నదిని పరిశుభ్రంగా ఉంచుతూ బాధ్యతాయుతంగా వేడుకలో పాల్గొనాలని నిర్వాహకులు సందర్శకులకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement