breaking news
Ganga aarti
-
వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్న జీ20 ప్రతినిధులు..
వారణాసిలో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠంలో జూన్ 11 నుంచి 12 వరకు జీ20 గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జీ20 ప్రతినిధులతో కలసి ఆదివారం వారణాసిలో జరిగే గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ మేరకు జీ20 ప్రతినిధులు వారణాసిలో దశాశ్వమేధ ఘాట్‌లో జరిగే గంగా హారతికి హాజరయ్యి సందడి చేశారు. ఆదివారం కాశీ విద్యాపీఠంలో జరగుతున్న 20 సదస్సుకు సుమారు 200 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఆదివారం ప్రారంభమైన ఈ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ..45 ఏళ్ల కెరియర్లో ఫిజీ, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీని ఆహ్వానించిన విధంగా మరో ప్రధానిని స్వాగతించడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ జీ20 అభివృద్ధి మంత్రి వర్గ సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిని అడ్డుకునే ఖరీదైన ట్రేడ్ ఆఫ్‌లను నివారించడం తోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజేస్) చేరుకునేలా అభివృద్ధి, పర్యావరణం, వాతావరణం ఎజెండాల మధ్య సమన్వయాలను సమిష్టిగా పెంపొందించేందుకు ఒక అవకాశంగా ఉంటుందని విదేశాంగ మంత్రి వెల్లడించారు. జనవరిలో భారత్ ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ తదనంతరం వారణాసిలో జీ20 అభివృద్ధి మంత్రుల సమావేశం జరగడం గమనార్హం. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు యూఎన్ శిఖరాగ్ర సమావేశంలోని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీఎస్)కి దోహదం చేస్తాయని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రపంచంలో పురాతన నగరాలలో ఒకటైన వారణాసిలోని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రతినిధులకు తెలియజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను, టూర్లను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ జీ20 గ్లోబల్ సదస్సులో రెండ ప్రధాన సెషన్లు ఉంటాయి. ఒకటి బహుపాక్షికత(ఎస్డీజీల దిశగా పురోగతిని వేగవంతం చేయడం), రెండు గ్రీన్ డెవలప్మెంట్(పర్వావరణ జీవన శైలి). #WATCH | EAM Dr S Jaishankar and G20 delegates attend Ganga aarti in Varanasi, Uttar Pradesh pic.twitter.com/toh2WVOL29 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 11, 2023 (చదవండి: అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా) -
గత ఐదేళ్లు శ్రమించాం.. వచ్చే ఐదేళ్లలో ఫలితాలు
వారణాసి/దర్భంగా: ఏ ఉగ్రమూకలకైనా సరికొత్త భారత్ దిమ్మతిరిగే జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలోనూ, పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లోనూ బాంబు పేలుళ్లు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. ఇటీవల కుంభమేళాను సైతం విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై వైమానికదాడుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం అదే ప్రాంతంలో 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామనీ, తమ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంత నియోజకవర్గం వారణాసిలో గురువారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నీ చేసేశా అని చెప్పను.. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేయడంపై మోదీ మాట్లాడుతూ..‘నేను వారణాసిలో ఏయే అభివృద్ధి పనులను చేపట్టాలని భావించానో అవన్నీ పూర్తి చేసేశానని చెప్పను. కానీ ఆ అభివృద్ధి పనులు మాత్రం ఇప్పుడు సరైన దిశలో, వేగంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో మేం నిజాయితీగా పనిచేశాం. దాని ఫలితాలు రాబోయే ఐదేళ్లలో ప్రజలు చూడబోతున్నారు’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ప్రస్తుతం పెనుసమస్యగా మారిపోయిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇటీవల శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రజలంతా ప్రార్థనల కోసం కుటుంబాలతో కలిసి చర్చిలకు వచ్చారు. కానీ వాళ్లు ప్రాణాలతో ఇళ్లకు తిరిగి వెళ్లలేదు. వాళ్లకు జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటిని ఉగ్రవాదులు ఒక్కసారిగా లాగేసుకున్నారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లే’ అని స్పష్టం చేశారు. అనుమతిస్తే నామినేషన్ వేస్తా.. ఉగ్రవాదులకు తమదైన భాషలో జవాబు చెప్పే ధైర్యం కాశీ(వారణాసి) తనకు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ‘మీ అందరికీ సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే. మీరంతా అనుమతిస్తే మరోసారి నేను నామినేషన్ దాఖలు చేస్తా’ అని తెలిపారు. ‘మీ అందరికీ మరోసారి సేవచేసేందుకు ఓట్లడిగే ముందు గత ఐదేళ్లలో ఏం చేశానో చెప్పాల్సిన బాధ్యత, జవాబుదారీతనం నాపై ఉన్నాయి. కానీ కొంతమంది(కాంగ్రెస్ పార్టీ) మాత్రం 70 ఏళ్లు పాలించినా ఏం చేశారో చెప్పరు. అది వారిష్టం’ అని చురకలు అంటించారు. వారణాసిలో నామినేషన్ నేడే.. ప్రధాని మోదీ బీజేపీ తరఫున వారణాసిలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. తొలుత ఉదయం 9.30 గంటలకు వారణాసిలోని బూత్‌స్థాయి నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. కాలభైరవుడికి ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్ వేసేందుకు వెళతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ హాజరవుతారని చెప్పారు. వీరితో పాటు అన్నాడీఎంకే, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలు హాజరయ్యే అవకాశముందన్నారు. లాంతర్ల రోజులు పోయాయి.. బిహార్ పర్యటనలో భాగంగా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పించారు. బిహార్‌లో లాంతర్లకు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) కాలం చెల్లిందనీ, ఇప్పుడు ఇంటింటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఈ లాంతర్వాలాలు(ఆర్జేడీ నేతలు) ప్రజల ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ వీరంతా తమ కుటుంబాల్లో వెలుగు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. వీళ్లలో ఒకరు ఫామ్‌హౌస్ కడుతుంటే, మరొకరు ఏకంగా షాపింగ్ మాల్ నిర్మించారు. ఇంకొకరు అయితే రైల్వే టెండర్ల ద్వారా రెండుచేతులా సంపాదించారు’ అని ఐఆర్సీటీసీ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మతవిశ్వాసాల కారణంగా తాను ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించననీ, భారత్ మాతాకీ జై అనడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ చెప్పడంపై మోదీ స్పందిస్తూ..‘డిపాజిట్లు రాకుండా ఓడించాల్సింది ఇలాంటి వ్యక్తులను కాదా?’ అని సభికులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ శరవేగంగా అభివృద్ధి చెందడానికి సాయం అందించినందుకు మోదీకి నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నామస్మరణ.. గురువారం సాయంత్రం మోదీ వారణాసిలో భారీ రోడ్‌షోను నిర్వహించారు. తొలుత బనారస్ హిందూ వర్సటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించిన ర్యాలీని ప్రారంభించారు∙మోదీ 7 కి.మీ పాటు సాగిన రోడ్ షోలో బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షోకు హాజరైన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు మోదీ.. మోదీ.. భారత్ మాతాకీ జై అని ఇచ్చిన నినాదాలతో వారణాసి వీధులు మార్మోగాయి. బీజేపీ చీఫ్ అమిత్, యూపీ ముఖ్యమంత్రి యోగి, రాష్ట్ర బీజేపీ చీఫ్ మహేంద్రనాథ్ సహా పలువురు నేతలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగింపులో భాగంగా దశాశ్వమేథ ఘాట్ కు చేరుకున్న మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాతో కలిసి గంగానదికి హారతి ఇచ్చారు. ‘వారణాసిలో లభించిన ఆత్మీయత, ప్రేమకు కృతజ్ఞుడిని’ అని ట్వీట్ చేశారు. మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించాక మద్దతుదారులకు మోదీ అభివాదం -
వారణాసిలో వైభవంగా గంగాహారతి
-
గంగా హారతిలో చార్లెస్ దంపతులు
బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌లో వేద పండితులు గంగానదికి ఇచ్చిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పరమత నికేతన్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఉత్తరఖండ్ వరదల్లో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరకున్నట్లు చార్లెస్ గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. గంగా నదిని తన జీవితంలో మొట్టమొదటిసారిగా చూశానని, ఆ నది తీరంలో తన జీవితంలో కొంతసమయాన్ని వెచ్చించడం తనకు, భార్య పార్కర్‌కు ఓ చక్కని అనుభూతిని ఇచ్చిందని ఆయన ట్విట్టర్లో తెలిపారు. భారత్‌లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం చార్లెస్ దంపతులు ఉత్తరఖండ్‌లోని జోలిగ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ దంపతులకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ బహుగుణ్, భారత్‌లో బ్రిటన్ రాయబారి జేమ్స్ డేవిడ్‌లు స్వాగతం పలికారు. చార్లెస్ సతీ సమేతంగా భారత్‌లో ముచ్చటగా మూడోసారి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకుంటారు. అలాగే ముంబైలో ప్రముఖ పారిశ్రామివేత్తలతో భేటీ కానున్నారు. దానితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తు పారిశ్రమికవేత్తలు, సంస్కృతి నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నెల 14న కొలంబోలో జరిగే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్లతారు.