పుతిన్ సంపాదన మరీ ఇంత తక్కువా?

President Polls: Putin Claims He Made $1 Million 6 Years As Russia President - Sakshi

వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్‌  వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేసింది. 

గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్‌ రెబెల్స్‌ (7,53,000  ఆమెరికన్‌ డాలర్లు)గా పుతిన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్‌ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్‌, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్‌ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్‌ పది వేర్వేరు బ్యాంక్‌ ఖాతాల్లో 54.5 మిలియన్‌ రెబెల్స్‌( 606,000 అమెరికన్‌ డాలర్లు) నగదు కలిగి ఉ‍న్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్‌ యూనియన్‌ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్‌ ట్రైలర్‌ ఉన్నాయి. పుతిన్‌ మాస్కోలో ఒక అపార్టుమెంట్‌, సెయింట్‌  పిరట్స్‌బర్గ్‌లో ఒక అపార్టుమెంట్‌, గ్యారేజ్‌ కలిగి ఉన్నారు.

అయితే పుతిన్‌ ఫిన్‌లాండ్‌ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్‌ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన  ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర  ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్‌ లడోగా నేషనల్‌​ పార్క్‌లో పుతిన్‌ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు.
 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top