PM Modi And Xi Jinping Meeting BRICS Request From China India Denies - Sakshi
Sakshi News home page

భారత్ చైనా సంబంధాలు బలపడాలి.. అప్పుడే శాంతి నెలకొంటుంది: జిన్‌పింగ్‌

Aug 25 2023 2:35 PM | Updated on Aug 25 2023 3:33 PM

PM Modi Xi Jinping Meeting Brics Request From China India Denies - Sakshi

న్యూఢిల్లీ: భారత్ అభ్యర్ధన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని.. వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్ధించింది చైనాయేనని అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది భారత విదేశాంగ శాఖ.    

జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు. అది కూడా వేదిక నుండి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు.  ఇదే వేదికపై మోదీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమేవేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషిచారు.    

భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక సంభాషణలో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతను తొలగించే విషయమైన చర్చించినట్లు తెలిపారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా. జూన్ 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనాయేనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.  

ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్ధన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు  మెరుగుపరచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.    

ఇది కూడా చదవండి: ట్రంప్‌ మగ్‌ షాట్‌:మస్క్‌ రియాక్షన్‌ అదిరిపోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement