breaking news
Indo-China ties
-
భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్ధన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని.. వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్ధించింది చైనాయేనని అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు. అది కూడా వేదిక నుండి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు. ఇదే వేదికపై మోదీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమేవేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషిచారు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక సంభాషణలో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతను తొలగించే విషయమైన చర్చించినట్లు తెలిపారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా. జూన్ 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనాయేనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్ధన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ట్రంప్ మగ్ షాట్:మస్క్ రియాక్షన్ అదిరిపోయింది! -
చైనాకు పుండు మీద కారం చల్లినట్టైంది!
బీజింగ్: ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై నిషేధం విధించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డి భారత్‌ను కవ్వించింది చైనా. ఇప్పుడా పొరుగు దేశానికి భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. వరల్డ్ విఘర్ కాంగ్రెస్ (డబ్ల్యూయూసీ) నాయకుడు దొల్కన్ ఇసాకు మనం దేశంలో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం వీసా మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ముస్లింలు అధికంగా ఉండే కల్లోల జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదానికి డబ్ల్యూయూసీ మద్దతు తెలుపుతున్నదని చైనా ఆరోపిస్తున్నది. ఉగ్రవాదిగా భావించే ఆ సంస్థ నాయకుడికి ఇప్పుడు భారత్ వీసా ఇస్తున్నదన్న వార్తలతో చైనాకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఈ నెల 28న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరగనున్న సదస్సు కోసం దోల్కన్ ఇసాకు భారత్ అనుమతించినట్టు తెలుస్తున్నది. ప్రవాసంలోని టిబెట్ ప్రభుత్వం ధర్మశాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రవాస ప్రభుత్వాన్ని ఆమోదించని చైనా.. దలైలామాపై భారత్ వైఖరిని తరచూ తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసాకు భారత్ వీసా వార్తలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇసా ఉగ్రవాది అని, అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసిందని, అతన్ని చట్టముందుకు తీసుకురావడానికి అన్ని దేశాలు సహకరించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.