వెస్ట్ పామ్ బీచ్: అమెరికాలోని దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలోని పామ్‌బీచ్ విమానాశ్రయం పేరును గురువారం ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’గా మార్చరు. పాత బోర్డుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసే పని మొదలైపోయింది. కొద్దికాలంపాటు పాత, కొత్త బోర్డులు రెండూ కనిపిస్తూంటాయని విమానాశ్రయ అధికారులు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిపారు.
కొత్త బోర్డులు, బ్రాండింగ్ తదితర ఏర్పాట్లకు 55 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి తన పేరు పెట్టడంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టు చేస్తూ... ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యద్భుతమైన విమానాశ్రయాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. దానికి తన పేరు పెట్టడం పెద్ద గౌరవంగా అభివర్ణించారు.


