breaking news
Palm Beach
-
షార్క్‌ను ఈడ్చి.. ఫోటోకు పోజిచ్చి
ఫ్లోరిడా: సెల్ఫీ పిచ్చితో అర్జెంటీనాలో ఓ బేబీ డాల్పిన్కు ఊపిరి ఆడకుండా చేసి దాని చనిపోయేలా చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. సముద్రపు అలలకు ఒడ్డుకు వచ్చిన ఓ సొర చేప పిల్లను గుర్తు తెలియని వ్యక్తులు ఫొటోల పిచ్చితో ఈడ్చి పూర్తిగా ఇసుకలో పడేశారు. అనంతరం దానిని అమాంతం అణిచిపట్టి దాదాపు 30 సెకన్లపాటు వివిధ రకాల భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత వీడియో తీశారు. ఇది ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్టు వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టగా ఆ వ్యక్తులపై నెటిజన్లు ఆ ఫొటోలు తిగిన వ్యక్తిపై భగ్గుమంటున్నారు. -
కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి..
న్యూయార్క్: ఇదొక ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఊహించుకోవడానికే జుగుప్సకరంగా అనిపించే సన్నివేశం. ఇప్పటి వరకు కుక్కలు మనుషులను కరవడం చూశాంగానీ.. ఓ మనిషే కుక్కని కరిస్తే.. అది కూడా నరకం కనిపించేంతదారుణంగా కనుగుడ్లు పీకేసేంతగా అయితే.. అమెరికాలోని పామ్ బీచ్ లో ఇలాగే చోటుచేసుకుంది. డేవిడ్ ఈడ్జెల్ (37) అనే వ్యక్తి తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకునే షియా జూ అనే బుజ్జి కుక్కను అమాంతం చేతిలోకి తీసుకొని కసిగా కొరికాడు. దాని కనుగుడ్లు పీకేశాడు. ఆ సమయంలో అతడు ఒళ్లు తెలియని విధంగా మద్యం మత్తులో ఉన్నాడు. ఓ మూగ ప్రాణిని హింసించిన ఫలితంగా అతడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ శిక్ష పడినందుకు అతడి తల్లి మిషెలీ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అతడు తాగిన మత్తులో చేసిన ఘోరానికి తగిన శిక్ష పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎంతో ప్రేమగా జూను పెంచుకున్నానని, దానిపట్ల డేవిడ్ అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని చెప్పింది. డేవిడ్‌ను మద్యం నుంచి, కోపం నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు విచారణ దాదాపు ఒక రోజంతా చేయడం కూడా ఆశ్చర్యకరం. ముందు కుక్కే అతడిని కరిచిందని, ఆ తర్వాతే తన క్లైంట్ దానిని కరిచాడని న్యాయవాది డేవిడ్ తరుపున వాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం డేవిడ్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.