పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి! | Pakistani soldiers dead over Baloch insurgents, full details | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి!

Mar 16 2025 1:58 PM | Updated on Mar 16 2025 2:53 PM

Pakistani soldiers dead over Baloch insurgents, full details

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్‌ సైనికుల కాన్వాయ్‌ను టార్గెట్‌ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని క్వెట్టా నుండి టఫ్తాన్‌కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్‌ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్‌ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement